

సంక్రాంతి అనగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించే పండగ హంగామా గుర్తుకు వస్తుంది. మూడు రోజుల పండగలో కోడి పందేల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పందేలను వీక్షించేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు. బరుల్లో లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయి.
పందెం కోళ్ల తయారీ కూడా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. డేగ, కాకి డేగ, కొక్కిరాయి, నెమలి వంటి పేర్లతో పిలిచే కోళ్లకు దసరా నుంచే ప్రత్యేక ఆహారం అందిస్తూ క్రమంగా శిక్షణ ఇస్తారు. ప్రతి 15 రోజులకు వాయిలాకు, వేపాకు, కుంకుడాకు, ఉసిరాకు, వట్టివేరు, పసుపు వంటి పదార్థాలను నీటిలో మరిగించి, ఆ వేడి నీటితో కోళ్లకు స్నానాలు చేయిస్తారు.
తర్వాత ఆవిరి శరీరానికి పట్టేలా గోనె సంచుల్లో కొంతసేపు ఉంచి, ఈత సాధనతో పాటు ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. ఇలాంటి తర్ఫీదే బరిలో బలంగా పోరాడేందుకు తోడ్పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరులోని ఓ ఫారంలో ఈ విధంగా పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు.


.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!