

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశముందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పండుగ సెలవుల కోసం ప్రయాణాలు పెరగడంతో ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ తప్పదని తెలిపారు.
ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ ప్రకారం, జనవరి 9 నుంచి 13 వరకు నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండగా, జనవరి 16 నుంచి 19, 2026 వరకు తిరిగి హైదరాబాద్‌కు వచ్చే ట్రాఫిక్ ఎక్కువగా ఉండనుంది. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్–ఆరంఘర్ మార్గం, ఎస్.ఆర్.నగర్–లక్డీకాపూల్, రెతిబౌలి–ఆరంఘర్, కాచిగూడ–రామంతాపూర్, ఎంజీబీఎస్–దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ప్రయాణికులు ముందస్తుగా ప్రయాణ ప్రణాళిక చేసుకోవాలని, పీక్ టైమ్స్‌ను వీలైనంత వరకు తప్పించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బస్సు, రైలు ప్రయాణాలకు ముందే బయలుదేరాలని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని తెలిపారు. అలాగే మెట్రో రైలు, ప్రజా రవాణా సేవలను ఉపయోగించాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. సంక్రాంతి పండుగను సురక్షితంగా, సాఫీగా జరుపుకోవడానికి అందరి సహకారం అవసరమని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!