

నగరంలోని కీలక రహదారిగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన రహదారితో పాటు నాలుగు ర్యాంపుల వద్ద నిర్మాణ మార్పులు చేపట్టాలని నిర్ణయించి, ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించింది. దాదాపు 17 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎగుడుదిగుడు పరిస్థితులు, బీటీ ఊడిపోవడం, చిన్న గోతులు ఏర్పడడం వంటి సమస్యలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధిక వేగంతో వాహనాలు నడవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.
అదనంగా ట్యాంక్‌బండ్‌పై సర్దార్ పాపన్న విగ్రహం వద్ద ఫుట్‌పాత్ మరమ్మతులు, హెచ్ఎండీఏ హెర్మిటేజ్ కాంప్లెక్స్‌లో కొత్త లిఫ్ట్ ఏర్పాటు, పాత లిఫ్ట్‌ల మరమ్మతులు చేపట్టనున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద బతుకమ్మ కుంట అభివృద్ధి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం, బుద్వేల్ లేఅవుట్ నుంచి రేడియల్ రోడ్-2 కలుపుతూ ఇంటర్చేంజ్ నిర్మాణానికి కన్సల్టెన్సీల నియామకం వంటి పలు పనులకు కూడా టెండర్లు ఆహ్వానించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!