
సినిమాలు

లోక్సభలో బుధవారం ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. సభాపతి స్థానంలో ఉన్న తెలుగు దేశం పార్టీ నేత కృష్ణ ప్రసాద్ తెన్నేటి స్వయంగా ఒక ప్రశ్న అడిగారు. ఆయన పేరిట ఉన్న ప్రశ్న చర్చకు రావడంతో సభ అనుమతి తీసుకుని మాట్లాడారు. తీరప్రాంతాల్లో లభించే ఖనిజాలను పర్యావరణానికి హాని కలగకుండా ఎలా తీసుకోవాలనే విషయం గురించి ఆయన మంత్రి జితేంద్ర సింగ్ను ప్రశ్నించారు.
దీనికి మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇస్తూ, ఈ ఖనిజాలు తీరప్రాంతాల్లో, రాతి పొరల్లో లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం తవ్వకాలు మళ్లీ ప్రారంభించామని తెలిపారు. గతంలో అక్రమ తవ్వకాలు జరిగి థోరియం వంటి ఖనిజాలను దొంగిలించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. అందుకే కొంతకాలం తవ్వకాలు ఆపి, ఇప్పుడు నియంత్రణతో కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతూ తవ్వకాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!