

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ తురుమ్ ఖాన్‌లు తెలంగాణ యాస, గ్రామీణ నేపథ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెడీ సన్నివేశాలు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో ఈ సినిమా చూసినవారు ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
కథ విషయానికి వస్తే, తుపాకుల గూడెం గ్రామానికి చెందిన శంకర్ (నిమ్మల శ్రీరామ్) పెళ్లి లాక్‌డౌన్ కారణంగా ఆగిపోవడంతో విరాజ్ బ్రహ్మ (దేవరాజ్ పాలమూర్)పై పగ పెంచుకుంటాడు. మరోవైపు ప్రేమ కథలు, అపార్థాలు, కామెడీ మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మలుస్తాయి. దర్శకుడు ఎన్. శివ కల్యాణ్ గ్రామీణ హాస్యాన్ని అద్భుతంగా చూపించగా, దేవరాజ్ కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. నిర్మాత ఎండీ ఆసిఫ్ జానీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ప్రశంసలు అందుకుంటోంది.

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!