

రష్యా అంతరిక్ష రంగంలో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. సోయుజ్–2.1బి వాహక నౌకను ఉపయోగించి రష్యా ఒకేసారి 52 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగాన్ని రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న వోస్టోక్నీ స్పేస్‌పోర్టు నుంచి ఆదివారం నిర్వహించినట్లు రష్యా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్ వెల్లడించింది.
ఈ ప్రయోగంలో భాగంగా వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇందులో ఇరాన్‌కు చెందిన మూడు కమ్యూనికేషన్ ఉపగ్రహాలు కూడా ఉండటం గమనార్హం. వాటిలో ఒకటైన ‘పాయా’ ఉపగ్రహం బరువు సుమారు 150 కిలోలు ఉండగా, ఇది ఇరాన్ ఇప్పటివరకు అంతరిక్ష కక్ష్యలోకి పంపిన అత్యంత భారీ ఉపగ్రహంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రయోగంతో రష్యా తన అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటినట్లైంది. ఒకేసారి భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగల సాంకేతిక నైపుణ్యం తమకుందని రష్యా స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!