

నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు గతంలో ఎప్పుడూ లేనంతగా సమీపానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే డాన్బాస్ ప్రాంతం సహా కొన్ని కీలక అంశాలపై చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని, అందువల్ల ఒప్పందం విఫలమయ్యే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు.
ఫ్లోరిడాలో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన భేటీలో 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై విస్తృతంగా చర్చ జరిగింది. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇంకా కొన్ని సున్నితమైన అంశాలు మిగిలే ఉన్నాయని ఇద్దరూ అంగీకరించారు. ముఖ్యంగా రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల భవితవ్యం, భవిష్యత్తులో మాస్కో మళ్లీ దాడి చేయకుండా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం నియంత్రణ వంటి అంశాలు చర్చలకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నట్లు వెల్లడించారు. శాంతి ఒప్పందం సాధ్యమవుతుందా లేదా అన్నది మరికొన్ని వారాల్లో స్పష్టత వస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ ప్రయత్నాలకు అమెరికా సహకారాన్ని అందిస్తున్నందుకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలుపుతూ, శాంతికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.







.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!