
టెక్నాలజీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకరతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన ప్రభావంతో టిప్పర్లోని కంకర బస్సుపై పడటంతో కొందరు అందులో ఇరుక్కుపోయారు. టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.











కామెంట్స్ (3)
చాలా బాధాకరమైన ఘటన 🙏
Prayers for the injured
day by day road accidents are increasing 🥲🥲🥲