
ఓటిటి

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికా – ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘర్షణను కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా “జీసస్ మరియు అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం”గా ఆయన అభివర్ణించారు.
అంతేకాకుండా, ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను ఒక నాస్తికుడినని పలుమార్లు వెల్లడించిన వర్మ, మతపరమైన నమ్మకాలపై తరచూ ఇలాంటి సెటైర్లు వేస్తూ ఉంటారు. ప్రపంచ రాజకీయాలపై తనదైన కోణంలో వ్యాఖ్యానించే ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివిధ రకాల చర్చలకు దారితీస్తోంది.






.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!