
న్యూస్
.webp&w=3840&q=75)
16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే ప్రభుత్వాల నిర్ణయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాను కేవలం కాలక్షేపంగా చూడటం మూర్ఖత్వమని, నేటి పోటీ ప్రపంచంలో సమాచారం, నైపుణ్యాలు మరియు గ్లోబల్ నెట్వర్క్ను అందించే ప్రధాన వనరు ఇదేనని ఆయన పేర్కొన్నారు. నిషేధం లేని దేశాల్లోని పిల్లలు యూట్యూబ్, రెడ్డిట్ వంటి ప్లాట్ఫారమ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ మరియు వ్యాపార మెళకువలను వేగంగా నేర్చుకుంటూ ముందుంటారని, నిషేధం ఉన్న దేశాల పిల్లలు వారి కంటే వెనుకబడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం భద్రత పేరుతో సమాచారానికి దూరం చేయడం వల్ల భవిష్యత్తులో ఈ పిల్లలు ప్రపంచ పోటీని తట్టుకోలేరని, ఇది వారి ఎదుగుదలకు తీరని నష్టమని ఆర్జీవీ స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!