

తిరుమల లడ్డూ తయారీలో వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలన సమయంలో ఆలయాల పరిధిలో జరిగిన ఘటనలను అప్పట్లో నిర్లక్ష్యంగా తీసుకున్నారని, వాటిని “పిచ్చి పనులు” గా కొట్టిపారేశారని నేతలు విమర్శించారు. లడ్డూ కల్తీ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురాకపోతే అది తప్పుగా మారుతుందనే ఉద్దేశంతోనే పూర్తి బాధ్యతతో ఈ విషయాన్ని వెల్లడించామని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఎన్డీడీబీ (NDDB) నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తమకు చదివి వినిపించారని వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం లడ్డూ నెయ్యిలో బీఫ్, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ వంటి పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యవహారం కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించినదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!