
ఆరోగ్యం

ప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరును “తెలుగునాడు” గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే పదంలో తెలుగుదనం ప్రతిఫలించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి తెలుగు భాష, సంస్కృతి ప్రతిబింబించేలా పేరు ఉండాలని ఆయన సూచించారు. గతంలో “తెలుగునాడు” గా మార్చేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
కేరళ రాష్ట్రాన్ని “కేరళం” గా మార్చిన పట్టుదల మన రాష్ట్రానికి కూడా అవసరమని గరికపాటి పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, భాషా స్వాభిమానాన్ని కాపాడాలంటే రాష్ట్రానికి “తెలుగునాడు” అనే పేరు సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో చర్చ మొదలైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!