

తెలంగాణలో 21 ఏళ్ల యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. మణికొండలోని చిత్రపురి కాలనీలో ఆమె తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై రాయదుర్గం పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకన్న మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా వెల్లడించిన వివరాల ప్రకారం, కోమలి ప్రేమ విషయమే ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని తెలిపారు. కోమలి మరియు అఖిల్ ఇద్దరూ విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారని, అక్కడే పరిచయం ఏర్పడిందని చెప్పారు.
తర్వాత కోమలి చదువు కోసం, అఖిల్ ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. కోమలి అఖిల్ పై తన మనసులోని భావాలను వ్యక్తపరిచిందని, అయితే అప్పటికే అతను మరో యువతితో సంబంధంలో ఉండటం వల్ల ఆమె ప్రేమను అంగీకరించలేదని వెల్లడించారు. ఈ కారణంగా కోమలి గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసిందన్నారు.
ఆ సమయంలోనే ఆమె తల్లికి ఈ విషయం తెలిసిందని, కుమార్తె కోసం అఖిల్‌ను పెళ్లి చేసుకోవాలని కోరినా, అతను నిరాకరించాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు కూడా కోమలి అఖిల్‌ను కలవాలని కోరగా, అదే విషయం పై మళ్లీ మాట్లాడినప్పటికీ అతను తన నిర్ణయాన్ని మార్చలేదని చెప్పారు.
కోమలి తన డైరీలో కూడా తన భావాలను రాసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అఖిల్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే, చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!