

తిరుమలలో నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు తొమ్మిది రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. మొత్తం 7,09,831 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని టీటీడి అధికారులు వెల్లడించారు. రోజుకు సగటున 75 వేల నుంచి 90 వేల మంది భక్తులకు సజావుగా దర్శనం కల్పించినట్లు తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్లు, టోకెన్ విధానం, ఆన్‌లైన్ స్లాట్‌లతో దర్శన వ్యవస్థను సమర్థంగా నిర్వహించామని చెప్పారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడి అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, అన్నప్రసాద కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి హుండీకి రూ.36.86 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. బంగారం, వెండి సహా విలువైన కానుకలు భారీగా లభించాయని చెప్పారు. ఈ ఆదాయాన్ని తిరుమల అభివృద్ధి, అన్నదానం, గోశాల, విద్యా మరియు వైద్య సేవలకు వినియోగిస్తామని తెలిపారు. భక్తుల విశ్వాసానికి ఇది నిదర్శనమని టీటీడి వ్యాఖ్యానించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!