
గాసిప్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఈ నిర్ణయాలను వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి అంచనాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
గత ఏడాది కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్లపై పలు మార్లు సవరణలు చేపట్టింది. 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో రెపో రేటు మొత్తం 1.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో రుణగ్రహీతలు, పెట్టుబడిదారులు కొంత స్థిరత్వాన్ని ఆశించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!