

ఈ రోజు స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్ దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీస్తోంది. దేశమంతా ప్రీమియర్ షోలు జరిగినప్పటికీ, ప్రింట్స్ ఆలస్యంగా రావడంతో తెలుగు ప్రీమియర్స్ రద్దయ్యాయి. ప్రస్తుతం సాధారణ ప్రదర్శనలు సజావుగా కొనసాగుతున్నాయి. దర్శకుడు ట్విస్టులు బయటపెట్టొద్దని, చివరివరకు సినిమా చూడాలని చెప్పడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదే సమయంలో నటీనటుల పారితోషికం వివరాలు కూడా ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇతర పాన్ ఇండియా సినిమాల్లా కాకుండా, ఈ చిత్రానికి రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్‌కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఎస్పీ అస్లాం చౌదరి పాత్రలో నటించిన సంజయ్ దత్‌కు సుమారు పది కోట్ల వరకు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో నటించిన మాధవన్‌కు తొమ్మిది కోట్ల వరకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది. అర్జున్ రాంపాల్, సారా అర్జున్‌లకు ఒక్కొక్కరికి సుమారు ఒక కోటి చొప్పున ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు ఆదిత్య ధర్ పారితోషికంపై స్పష్టమైన వివరాలు లేకపోయినా, ఈ సినిమా వల్ల ఆయన పేరు మరింత పెరిగింది.
కథ విషయానికి వస్తే, మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్‌కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్‌ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్‌లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్‌ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.









.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!