

భారత్‌తో పాటు ఐదు మిత్ర దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఈ సమాచారం వెల్లడించింది. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్ దేశాలకు ఈ అనుమతి వర్తిస్తుంది. దీంతో హర్మూజ్ వద్ద ఆగిపోయిన భారత నౌకలు ఇప్పుడు తమ సరుకులను సులభంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అనుమతుల కోసం ఎదురు చూస్తున్న గ్యాస్ ట్యాంకర్లకు కూడా ఇది ఉపశమనం కలిగించే నిర్ణయం.
ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేయని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై టోల్ వేయాలని ఇరాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంపై పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాపారం, ముఖ్యంగా ఇంధన సరఫరాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!