

ఎల్పీజీ (LPG) గ్యాస్ బుకింగ్ టైమ్లైన్స్పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రీఫిల్ బుకింగ్ గడువులు మారాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలు పూర్తిగా అసత్యమని వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న నియమాలలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుత విధానాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు 25 రోజుల తర్వాత గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ గడువులు యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

గ్యాస్ సరఫరా లేదా బుకింగ్ వ్యవస్థపై తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్న నేపథ్యంలో, ప్రజలు అలాంటి వార్తలను నమ్మకూడదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని, అపోహలకు లోనవకుండా జాగ్రత్తగా ఉండాలని కోరింది.
.webp&w=3840&q=75)
















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!