
న్యూస్

ముంబై–బెంగళూరు హైవేపై నవలే బ్రిడ్జ్ సమీపంలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో ఏడు మంది మరణించారు. రెండు భారీ కంటైనర్ ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగిన సమయంలో, వాటి మధ్యలో వెళ్లుతున్న కారు పూర్తిగా నలిగిపోయింది. ఈ ప్రమాదంలో 8–10 మంది గాయపడ్డారు అని అధికారులు తెలిపారు.
పోలీస్ డీసీపీ సంభాజీ కడం తెలిపిన వివరాల ప్రకారం, ముంబై వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ట్రక్కు బ్రేక్ ఫెయిల్యూర్ వచ్చినట్టు అనుమానం. నియంత్రణ కోల్పోయిన ట్రక్ ముందున్న మరో కంటైనర్ను ఢీకొట్టగా, మధ్యలో ఉన్న కారు పూర్తిగా నలిగిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీములు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!