
సినిమాలు

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ కమిటీని నియమించింది. ఈ ఏడాది జనవరి 12న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్లో సాలిడ్ మోటార్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మిషన్ విజయవంతం కాలేదు. గత ఏడాది మే 18న జరిగిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగం కూడా మూడో దశలో సాంకేతిక సమస్యల కారణంగా విఫలమవడం గమనార్హం.
ఈ వరుస వైఫల్యాలను కేంద్రం సీరియస్‌గా తీసుకుని, పీఎం మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె. విజయరాఘవన్ అధ్యక్షతన, మాజీ ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ సహాధ్యక్షుడిగా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షార్ సెంటర్‌తో పాటు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను సందర్శించి ప్రయోగ వైఫల్యానికి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!