
క్రీడలు

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల భద్రతను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించాలని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ ఉన్న భారతీయులు ముఖ్యంగా తెలంగాణ వాసులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అక్కడి తెలంగాణ ప్రజలను స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!