

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ షూటింగ్ కోల్‌కతాలో శరవేగంగా సాగుతోంది. ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యిన తర్వాత ప్రస్తుతం 15 రోజుల కీలక షెడ్యూల్ కోల్‌కతాలో ప్రారంభమైంది. గంగూలీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాలో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు పోషిస్తున్నారు. కోల్‌కతా షెడ్యూల్‌లో ఎరుపు రంగు ట్రాక్‌సూట్‌లో ఆయన లుక్ వైరల్‌గా మారింది. గంగూలీ ప్రారంభ జీవితం నుంచి లార్డ్స్‌లో జెర్సీ విసిరిన చారిత్రక ఘట్టం వరకు ఈ సినిమాలో చూపించనున్నారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. డోనా గంగూలీ పాత్రలో తాన్యా మణిక్తల నటిస్తోంది. ఈ షూటింగ్‌ను సౌరవ్ గంగూలీ స్వయంగా ఈడెన్ గార్డెన్స్ సహా కీలక ప్రదేశాల్లో పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!