
గాసిప్స్

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో మహిళా న్యాయవాది స్వప్న (34) సొంత అన్న చేతిలో హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా, కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తి వివాదాల నేపథ్యంలో బుధవారం ఉదయం పొలం వద్ద పంచాయతీ జరుగుతున్న సమయంలో ఆమెపై సోదరుడు దాడి చేసి హతమార్చాడు.
సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్–బీజాపూర్ హైవేపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!