

పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఆమె పాల్గొనాల్సిన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్యక్రమాన్ని చివరి క్షణంలో బాగ్డోగ్రా విమానాశ్రయం సమీపానికి మార్చాల్సి వచ్చింది. దీంతో ప్రతినిధులు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే అక్కడికి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతిని స్వాగతించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకావాల్సి ఉండగా, ఒక మేయర్ మాత్రమే రావడం పట్ల ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నివేదిక పంపాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని విమర్శించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమని, దానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఎన్నికల ముందు రాష్ట్రపతి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేందుకు భాజపా రాష్ట్రపతి పదవిని ఉపయోగిస్తోందని విమర్శించారు. ఆమె ఏడాదికి ఒకసారి వస్తే స్వాగతిస్తానని, కానీ ఎన్నికల సమయంలో తరచూ పర్యటనలు చేస్తే సాధ్యం కాదని మమతా వ్యాఖ్యానించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!