

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించి, ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ నౌకాదళ స్థావరాన్ని సందర్శించారు. నౌకాదళ హార్బర్లో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన జలాంతర్గామి INS వాఘ్షీర్లో ఆమె ప్రయాణించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో భారత రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ పర్యటనలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ఆమె వెంట ఉన్నారు.
కార్వార్ నౌకాదళ కేంద్రంలో భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షించారు. ప్రాజెక్ట్-75 కింద నిర్మించిన కల్వరీ తరగతికి చెందిన ఆరో జలాంతర్గామి INS వాఘ్షీర్ పనితీరును ఆమె సముద్ర గర్భంలో ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా మహిళా అధికారులతో సహా నౌకాదళ సిబ్బందితో మాట్లాడిన ఆమె, రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవ వందనంతో ప్రారంభమైన ఈ పర్యటన, నౌకాదళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరిచిందని అధికారులు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!