
క్రీడలు

కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రధాని లేఖ రాస్తూ, ఈ వివాహం విజయ్-రష్మిక జీవితాల్లో కొత్త అందమైన అధ్యాయానికి నాంది కావాలని ఆకాంక్షించారు. సప్తపది పవిత్ర బంధంతో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా, సహచరులుగా కొనసాగాలని ప్రధాని తన సందేశంలో కోరారు.

రేపు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ–రష్మికల వివాహం అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్‌గా జరగనుంది. కాగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు వచ్చే నెల 4 న హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ రిసెప్షన్‌కు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!