
రాజకీయాలు

ఒకప్పుడు ఫార్మా ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. విమాన విడి భాగాలు, రక్షణ పరికరాలు, పారిశ్రామిక యంత్రాల ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది.
వాణిజ్య నిఘా, గణాంకాల డైరెక్టరేట్ జనరల్ నివేదిక ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య తెలంగాణ 117.9 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2022–23లో 1,827 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2024–25 నాటికి 7,535 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉత్పత్తులు పెరగడం, హైదరాబాద్లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు రావడం వల్ల తెలంగాణ నాలుగో అతిపెద్ద ఇంజనీరింగ్ ఎగుమతి రాష్ట్రంగా ఎదిగింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!