
క్రీడలు

బొలీవియా రాజధాని లాపాజ్ సమీపంలోని ఎల్ ఆల్టోలో శుక్రవారం బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని సృష్టించింది.
అధికారుల ప్రకారం, ఈ ప్రమాదంలో 15 మంది మరణించి 30 మంది గాయపడ్డారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకెళ్తుండగా ఈ ఘటనం జరిగింది. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
విమానపతనం జనసంచారం ఉన్న ప్రాంతంలో జరగడంతో మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!