
న్యూస్

దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఫింగర్ ప్రింట్ మరియు ఐరిస్ స్కాన్ ఆధారిత గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల పారదర్శకతను పెంచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, భారత ప్రభుత్వం మరియు భారత ఎన్నికల కమిషనుకు నోటీసులు జారీ చేసింది. ఈ చర్య ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, దొంగ ఓట్లను అరికట్టేందుకు దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!