
సినిమాలు

సీపీ సజ్జనార్ ఐపీఎల్ పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలపై ప్రజలను హెచ్చరించారు. ఐపీఎల్ క్రేజ్‌ను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలు పెరుగుతున్నాయని చెప్పారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మ్యాచ్ ఫలితాలు, టాస్ ముందే చెబుతామని చెప్పి ప్రజలను మోసం చేస్తూ బెట్టింగ్‌లోకి లాగుతున్నారని తెలిపారు.
ఇలాంటి మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలోనే 494 ప్రకటనలు, 129 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశారు. ఇలాంటి ఫేక్ ఛానెళ్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!