

అమరావతి మరియు హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి యత్నం చేయడం తీవ్రంగా ఖండనీయమని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీడియాను ప్రశ్నించినందుకు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడిగా ఈ ఘటనను అభివర్ణిస్తూ, తమపై విమర్శలు వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాడులు, నిరసనలకు దిగడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ పాలనలో మీడియా సంస్థలపై అనేక ఒత్తిళ్లు వచ్చినా అవి ధైర్యంగా నిలిచాయని గుర్తుచేశారు.
రాజధాని అమరావతి అంశంపై ప్రశ్నించినందుకు మీడియాపై ఆరోపణలు చేయడం, దూషణలకు దిగడం అసంబద్ధమని సీఎం అన్నారు. రౌడీ మూకలతో కలిసి ప్రజాప్రతినిధులు మీడియా కార్యాలయాలపైకి వెళ్లడం వైసీపీ సంస్కృతికి నిదర్శమని విమర్శించారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని, మీడియాను బెదిరించే ప్రయత్నాలకు కాలం చెల్లిందని చంద్రబాబు స్పష్టం చేశారు.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!