

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీజీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను వేగంగా పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలని SITకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సజ్జనార్‌తో పాటు మరో నలుగురు ఐపీఎస్ అధికారులను నియమించగా, మొత్తం 9 మంది పోలీసు అధికారులు SITలో భాగంగా పనిచేయనున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన ఈ కేసును ఇకపై SIT పూర్తిగా దర్యాప్తు చేయనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, SIT ఏర్పాటు చేయడం ద్వారా విచారణ మరింత పారదర్శకంగా, వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!