
సినిమాలు

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ముఖ్య అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. సభలో చర్చించాల్సిన అంశాలు, బిల్లులు, ఇతర కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
లోక్సభ, రాజ్యసభల ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు చర్చ కొనసాగే అవకాశం ఉంది. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. అనంతరం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో దశ సమావేశాలు జరుగనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!