

ఇస్లామాబాద్‌లో జరిగిన ఘోర ఆత్మాహుతి దాడి నెపాన్ని భారత్‌పై నెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా (అషూర్ఖానా)లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ పేల్చుకున్న ఘటనలో 69 మంది మృతి చెందగా, 169 మంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక భారత్ పాత్ర ఉందన్న ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. అయినప్పటికీ పాక్ నేతలు భారత్‌పై విమర్శలు కొనసాగిస్తున్నారు.
తాజాగా పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ, తమ దేశంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థలకు భారత్ నిధులు అందిస్తోందని ఆరోపించారు. ఈ దాడిలో ఐసిస్, తాలిబాన్ సంబంధం ఉందని, వారికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. దాడికి సంబంధించి ఒక అఫ్గాన్ పౌరుడిని ప్రధాన సూత్రధారిగా గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. అయితే ఈ ఘటనకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. పోలీసు వర్గాల ప్రకారం ఇది తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) పని అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగటం తీవ్ర సంచలనం కలిగించింది. భారత్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!