
ఓటిటి

గల్ఫ్ ప్రాంతంలోని ఎనిమిది యూఏఈ దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంతో ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబి వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉన్నారు.
ఇక గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. విమాన సర్వీసులు, భద్రతా పరిస్థితులపై అనిశ్చితి నెలకొనడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులను భారత అధికారులు పర్యవేక్షిస్తున్నారని, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!