
గాసిప్స్

లోక్‌సభలో మంగళవారం విపక్ష సభ్యుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్పీకర్ ముందు ఉన్న టేబుల్‌పైకి ఎక్కి కొందరు ఎంపీలు నిరసన చేపట్టగా, ప్యానెల్ స్పీకర్ వైపు పేపర్లు విసరడంతో సభలో రచ్చ చోటుచేసుకుంది. ఈ ఘటనతో సభా కార్యకలాపాలు పలుమార్లు నిలిచిపోయాయి.
అశాంతి సృష్టించినందుకు గాను విపక్షానికి చెందిన 8 మంది ఎంపీలను ప్రస్తుత సెషన్ ముగిసే వరకు లోక్‌సభ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణకు చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. విపక్ష చర్యలను అధికార పక్షం తీవ్రంగా తప్పుబట్టింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!