
సినిమాలు

ఏ. రేవంత్ రెడ్డి రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన–ప్రగతి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొని, రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఈరోజు ₹2,200 కోట్లను విడుదల చేయగా, ఇప్పటివరకు ₹5,700 కోట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. వచ్చే నెలలో మరో ₹3,300 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొంటూ, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాల ద్వారా రైతు సంక్షేమాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు.















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!