
గాసిప్స్
.jpg&w=3840&q=75)
భువనేశ్వర్: ప్రజారోగ్య పరిరక్షణ దిశగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలా, తంబాకు, జర్దా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ, విక్రయం, నిల్వ, రవాణా, పంపిణీపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.
పొగాకు ఉత్పత్తుల వలన క్యాన్సర్ సహా అనేక ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!