
ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో అభ్యంతరకర పోస్టులు చేస్తున్న వ్యక్తిపై ఏపీ బీజేపీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుద్రరాజు అనే పేరుతో ఎక్స్‌లో పోస్టులు చేస్తూ ప్రధాని వ్యక్తిగత పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ పోస్టులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఏపీ బీజేపీ తెలిపింది. సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజా నాయకుల గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొంటూ, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!