
గాసిప్స్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారంపై అయోధ్య జిల్లా పరిపాలన మరియు స్థానిక అధికారులు నిషేధం విధించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆలయ పరిసర ప్రాంతాల్లో నాన్-వెజ్ ఆహారాన్ని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్ములు సరఫరా చేయరాదని ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని “పంచకోశ పరిధి” గా గుర్తించి సంబంధిత ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆలయ పరిసరాల్లో పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణం కొనసాగించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అయోధ్య జిల్లా యంత్రాంగం తెలిపింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, నిబంధనలను ఉల్లంఘించే ఫుడ్ డెలివరీ సంస్థలు మరియు వ్యాపారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!