

నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేస్తూ, దేశం అభివృద్ధి దిశగా సాగుతుంటే బెంగాల్ మాత్రం వెనుకబడుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హల్దియాలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజలు ఎన్డీయేకు మద్దతు ఇచ్చి మార్పు తీసుకురావాలని కోరారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. పాలనలో మార్పులు, అవినీతి మరియు మహిళలపై నేరాలపై కఠిన చర్యలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీ వ్యవస్థ వంటి అంశాలను ప్రాధాన్యంగా అమలు చేస్తామని తెలిపారు. చట్టబద్ధంగా ఆశ్రయం పొందిన శరణార్థులకు సంక్షేమ పథకాలు అందిస్తామని, అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ అమలు కూడా చేస్తామని హామీ ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!