

పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ తన కుమారుడిపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను ఖండించారు. 2021లో మహేష్‌కు హార్ట్ సర్జరీ జరిగిందని, పెద్ద స్టంట్ వేశారని తెలిపారు. అప్పటినుంచి డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారని, పల్స్ రేటు 130–140 దాటితే ప్రాణాపాయం ఉందని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఉన్న తన కుమారుడు డ్రగ్స్ తీసుకోవడం అసంభవమని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే జరిగిన పరీక్షల్లో మహేష్ డ్రగ్స్ తీసుకోలేదని తేలిందని తెలిపారు. కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ రావచ్చని ఆక్స్ఫర్డ్ వంటి సంస్థలు చెబుతున్నాయని చెప్పారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా తప్పుగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక అన్ని ఆధారాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తామని, ఇప్పటికే అన్ని వివరాలు అధిష్ఠానానికి ఇచ్చామని, వారు తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.







.jpg&w=3840&q=75)


.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!