
గాసిప్స్

విద్యుత్ చార్జీలను పెంచే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ట్రూ-డౌన్ సర్దుబాట్ల వల్ల కలిగే లాభాలను నేరుగా వినియోగదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఒకప్పుడు విద్యుత్ కొరత ఎదుర్కొన్న రాష్ట్రం ఇప్పుడు క్రమంగా పవర్ సర్ప్లస్ దిశగా సాగుతోందని, విద్యుత్ కొనుగోలు ఖర్చును యూనిట్‌కు రూ.3.90 వరకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
సౌర రూఫ్‌టాప్ వ్యవస్థలు, విండ్ పవర్, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. విద్యుత్ నిర్వహణలో సమర్థత పెంచుతూ, చార్జీలు స్థిరంగా ఉంచడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మెరుగైన ప్రణాళికలు, ఖర్చు నియంత్రణ చర్యల ద్వారా గృహాలు, రైతులు, పరిశ్రమలకు విశ్వసనీయమైన మరియు చవకైన విద్యుత్ అందించడమే లక్ష్యమని వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!