

తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. HPCL, IOCL, BPCL వంటి ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ ఎక్కడా అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన లభ్యత స్థిరంగా ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అయితే తప్పుడు వార్తల కారణంగా ప్రజలు అనవసరంగా ఎక్కువగా కొనుగోలు చేయడంతో సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని తెలిపింది. దీని వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయినట్లు కనిపించినా, అది కొరత కాదని స్పష్టం చేసింది. పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాలు, క్యాన్లలో నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధమని, ఇది ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రజలు అవసరమైనంత మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని, తప్పుడు వార్తలను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది.

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!