ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ “కీ స్పీకర్స్” జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించబడినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, బాధితుల పక్షాన నిలబడే దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎప్స్టైన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనకు పంపిన ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఎప్స్టైన్తో సంబంధాలపై వెలుగులోకి వచ్చిన వివాదాల నేపథ్యంలో, బిల్ గేట్స్‌పై వివాహేతర సంబంధాలకు సహకారం పొందినట్లు, అలాగే డ్రగ్స్, చిన్నారులు మరియు వివాహితులతో అనుచిత సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను సమ్మిట్ స్పీకర్ల జాబితా నుంచి తప్పించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.





.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!