

మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో యువత నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరూ ఈ వేడుకల్లో మునిగిపోతారు. వీరిలో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు. అలాంటి వారు మద్యం సేవించి స్వయంగా వాహనం నడిపి ఇంటికి వెళ్లలేని పక్షంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఉచిత డ్రాప్ సేవలు అందిస్తోంది. 8977009804 నంబర్‌కు కాల్ చేస్తే ఉచిత రైడ్ సౌకర్యం అందజేస్తామని యూనియన్ స్పష్టం చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ ఉచిత రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది.
డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 రాత్రి 1 గంట వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని యూనియన్ పేర్కొంది. గత ఎనిమిది సంవత్సరాలుగా న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి ఉచిత రైడ్స్ అందిస్తున్నట్లు టీజీపీడబ్ల్యూయూ గుర్తు చేసింది. ఈసారి మొత్తం 500 వాహనాలను, క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. #HumAapkeSaathHai ప్రచారం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించింది.
.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!