

అమెరికాలోని ఓ అపార్ట్మెంట్లో హత్యకు గురైన నికిత గోదిశాల కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మను భారత్‌లో అరెస్టు చేశారనే వార్తల్లో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. సంయుక్త ప్రకటన విడుదల చేసిన కుటుంబ సభ్యులు, అర్జున్ శర్మ అరెస్టయ్యాడని వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని పోలీసు అధికారులు, అమెరికా చట్ట అమలు సంస్థలతో నేరుగా మాట్లాడిన అనంతరం, నిందితుడి అరెస్టుపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని నిర్ధారించుకున్నట్లు పేర్కొన్నారు.
నికిత మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంపై ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులర్ అధికారులు, భారత ప్రభుత్వ సంబంధిత విభాగాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. నికిత తండ్రి ఆనంద్ గోదిశాల మాట్లాడుతూ, మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు మరో మూడు నుంచి నాలుగు రోజులు పట్టవచ్చని అమెరికా అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నికిత మృతదేహాన్ని త్వరితగతిన భారత్‌కు తీసుకురావడంతో పాటు అర్జున్ శర్మపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఆయన లేఖ రాశారు.












.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!