

భారత్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. జనవరి 1 నుంచి ఈ ఫీజు పెంపు కొన్ని కేంద్రాల్లో అమల్లోకి రానుంది. భారత్తో పాటు మొత్తం 25 దేశాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగానే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
వీసా అప్లికేషన్ ఫీజుకు అదనంగా వీసా దరఖాస్తు కేంద్రాలు వసూలు చేసే సర్వీసు ఫీజు వేరేనని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇటీవల చేపట్టిన సిస్టమ్ అప్గ్రేడ్ల కారణంగా ఈ పెంపు తప్పనిసరి అయిందని పేర్కొంది. దరఖాస్తు చేసుకునే ముందు తాజా ఫీజు వివరాలను తప్పకుండా పరిశీలించాలని దరఖాస్తుదారులకు సూచించింది.
భారత్తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీసా కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు సంబంధిత వీసా అప్లికేషన్ సెంటర్ లేదా VFS Global వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు. సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా ఆన్లైన్ అప్లికేషన్లు, డాక్యుమెంట్లు చూడడంలో కొంత సాంకేతిక అంతరాయం తలెత్తే అవకాశముందని కూడా హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!