

అమెరికా–ఇరాన్ చర్చలకు వేదికగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని పాకిస్థాన్ ఆశించింది. అయితే ఆ ప్రయత్నంలోనే తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లును కూడా చెల్లించలేని స్థితికి చేరడంతో దేశం అపఖ్యాతి మూటగట్టుకుందని సమాచారం. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడంతో పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి అప్పులు తీసుకుంటూ పరిస్థితిని కొనసాగిస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపే మధ్యవర్తిత్వ అవకాశాన్ని పాకిస్థాన్ పొందింది. ఈ నెల 10వ తేదీన ఇరుదేశాల ప్రతినిధులు శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్ వేదికగా చర్చలు జరిగినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ హోటల్ బిల్లులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఆ బిల్లును చెల్లించలేకపోవడంతో సమస్యను పరిష్కరించేందుకు హోటల్ యజమాన్యమే రంగంలోకి దిగినట్లు సమాచారం.
హోటల్ యాజమాన్య సంస్థ అయిన ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో పాకిస్థాన్ దౌత్య ఆశయాలకు, దేశంలోని ఆర్థిక వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న భారీ అంతరం మరోసారి బయటపడింది. అంతర్జాతీయ వేదికపై శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అంతర్గత ఆర్థిక సమస్యలు దేశానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!