
టెక్నాలజీ

వైసీపీ నేత అంబటి రాంబాబు తనను పోలీసుల కస్టడీలో టార్చర్‌కు గురి చేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ ఘటనపై సీఐడీ లేదా సిట్ కాకుండా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, తన నిర్బంధ కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో తనపై టార్చర్ జరిగిందని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన హైకోర్టును కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!